బైజూస్‌ సీఈవో నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

- April 29, 2023 , by Maagulf
బైజూస్‌ సీఈవో నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

బెంగళూరు: ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ బైజు, ఆయన కంపెనీ థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శనివారం సోదాలు చేపట్టింది. ఫెమా చట్టం కింద నమోదైన కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. మొత్తం మూడు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు జరిపింది. ఈ తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, డిజిటల్‌ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ 2011 నుంచి 2023 మధ్య రూ.28వేల కోట్ల విలువైన ఎఫ్‌డీఐ(విదేశీ పెట్టుబడులు)లు అందుకున్నట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com