మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు
- April 29, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో వివిధ పండుగలు, పర్వదినాలు, ఇతర కారణాల దృష్ట్యా బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి. వారాంతపు సెలవులతో పాటు దేశమంతా వివిధ ప్రాంతాల్లో మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవు. దేశవ్యాప్తంగా మే నెలలో 12 రోజులు బ్యాంకులు పని చేయవు. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. మే డే కార్మిక దినోత్సవం సందర్భంగా మే1వ తేదీ దేశ వ్యాప్తంగా కార్మికులు మేడే జరుపుకుంటారు. కనుక మేడేతో ఈ నెల ప్రారంభం అవుతోంది.
మే1వ తేదీన మేడే.. బెలాపూర్, బెంగళూరు, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొచి, కోల్ కత్తా, ముంబై, నాగ్ పూర్, పనాజీ, పాట్నా, తిరువనంతపురంలో సెలవులు ఉంటాయి. మే2వ తేదీన మున్సిపల్ ఎన్నికల కారణంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే5వ తేదీన బుద్ధ పౌర్ణమి సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బెలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్ కత్తా, ముంబై, నాగాపూర్, న్యూఢిల్లీ, రాయ్ పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
మే7వ తేదీన ఆదివారం దేశమంతటా సెలవు ఉంటుంది. మే9వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని కోల్ కత్తాలో సెలవు ఉంటుంది. మే13వ తేదీన రెండో శనివారం దేశమంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే14వ తేదీన ఆదివారం దేశమంతటా సెలవు ఉంటుంది. మే16వ తేదీన సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాంగ్ టక్ లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మే20వ తేదీన నాలుగో శనివారం దేశమంతటా సెలవు ఉంటుంది. మే21వ తేదీన ఆదివారం దేశమంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే22వ తేదీన మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా సిమ్లాలో సెలవు ఉంటుంది. మే28వ తేదీన ఆదివారం దేశమంతటా సెలవు ఉంటుంది.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు. మే నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. మే20వ తేదీ నాలుగో శనివారం, మే21వ తేదీన ఆదివారం, మే22వ తేదీ మహారాణా జయంతి సందర్భంగా బ్యాంకులకు హాలీడే ఉంటుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







