బహ్రెయిన్‌లో నలుగురు ఆసియన్లపై విచారణ ప్రారంభం
- May 01, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఘటనలో నలుగురు ఆసియన్లను కస్టమ్స్ వ్యవహారాల సహకారంతో యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ పట్టుకుంది. ఈ సందర్భంగా మెయిల్ ప్యాకేజీల ద్వారా మాదక ద్రవ్యాల రవాణా కుట్రను భగ్నం చేసింది. సుమారు BD 100,000 విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ కస్టమ్స్ అధికారుల నుండి సమాచారం అందుకున్న తరువాత యాంటీ నార్కోటిక్ అధికారులు విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు. ఇటీవల బంగాళదుంపల లోపల డ్రగ్స్ ను పెట్టి అక్రమ రవాణా చేసిన కేసులో ఆరుగురు ఆసియన్లను డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బహ్రెయిన్ లో 2021లో 560 డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు నమోదు కాగా.. 2022లో 830 కేసులు నమోదు అయినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు









