అబుధాబిలో ఘనంగా ఇండియన్ ఉమెన్స్ ఫోరమ్ గ్రాండ్ ఫినాలే
- May 07, 2023
అబుధాబి: ఇండియా సోషల్ సెంటర్ (ISC ) అబుధాబిలో ప్రవాసీ భారతీయుల ప్రముఖ సాంఘిక మరియు సంక్షేమ కేంద్రంగా గత 56 సంవత్సరాలు గా సేవలు అందింస్తుంది. ఆ సంఘం మహిళా విభాగం Indian Womens Forum (IWF) మహిళా సాధికారత సాధించే విషయం లో ముందంజలో ఉంది. సంవత్సరాంతం IWF సంస్థ మహిళలే ప్రాధాన్యత గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. IWF వారు 2022-2023 సంవత్సరం గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని ఎంతో అంగ రంగ వైభవంగా ISC ముఖ్య ప్రాంగణంలో శుక్రవారం రాత్రి (May 5th) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయాన్ని చెందిన డీసీఎం సతీమణి జాహ్నవి అమర్నాథ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.
ఇండియా సోషల్ సెంటర్ యాజమాన్యం కూడా ఇతర అతిధులు గా రావడం విశేషం. ఈ కార్యక్రమం లో ప్రవాసీ భారతీయలు ఎంతో ఉత్సాహం తో భారతీయత ఉట్టిపడేలా కథక్, భారత నాట్యం మరియు కూచిపూడి నాట్యాలు ప్రదర్శించడం జరిగింది.
అలాగే మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచిన Unity in Diversity Concept తో చేసిన 29 రాష్ట్రాల వేషధారణ (Fashion Dress) అందరిని ఎంతో ఆకట్టు కుంది అని కార్యక్రమ నిర్వాహకులు షీలా మీనన్, పావని ఐత, ఐనీష్, అనూజ, శిల్ప మరియు దీప తెలియజేశారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్రాన్ని represent చేస్తూ వచ్చిన ఇద్దరు మహిళలు తెచ్చిన బోనము మరియు బతుకమ్మ విశేష ఆకర్షణ గా నిలిచాయి.
2022-2023 సంవత్సరం IWF కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించినందుకు ముఖ్య కార్యకర్తలకు ముఖ్య అతిధి జాహ్నవి గ్యాపికలు అందజేశారు. అలాగే కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి IWF యాజమాన్యం బహుమతులు అందజేసింది.






తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







