అంతర్జాల మాధ్యమం ద్వారా ఘనంగా అంతర్జాతీయ కవి సమ్మేళనం
- May 07, 2023
"వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా", "వంశీ ఇంటర్నేషనల్" "శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్" మరియు "శుభోదయం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అంతర్జాల మాధ్యమం ద్వారా, 12 దేశాల నుండి సుమారు 75 మంది కవులు కవయిత్రులతో "అంతర్జాతీయ కవిసమ్మేళనం" అద్వితీయంగా జరిగింది.
"పింగళి వెంకయ్య రూపొందించిన భారత జాతీయ జండా యొక్క 102వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీనికి పింగళి వెంకయ్య గారి మనుమడు జివియన్ నరసింహం జ్యోతి ప్రకాశనం గావించి ప్రారంభించారని"
నిర్వాహకులు తెలియజేశారు.
భారతదేశం నుండి ప్రముఖ కవులు కవయిత్రులతో పాటుగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, యూకె, దక్షిణ ఆఫ్రికా, కెనడా, అమెరికా దేశాల నుండి కవులు పాల్గొని, "భారతదేశ జాతీయ సమైక్యత - విశిష్టత" అనే అంశంపై తమ కవితలు వినిపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా వంగూరి చిట్టెన్ రాజు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్న కుమార్, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు తమ ప్రసంగాలను అందించారు. కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభను నిర్వహించగా, కృష్ణవేణి సహ వ్యాఖ్యాతగా సహకరించారు. శుభోదయం మీడియా ద్వారా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.



తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







