తేజ దర్శకత్వంలో నటించనున్న రానా
- May 10, 2016
వారసులుగా ఎంట్రీ ఇచ్చిన యువ కథానాయకులు స్టార్ ఇమేజ్ కోసం పోటీ పడుతుంటే యంగ్ హీరో రానా మాత్రం విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అతిథి పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. బాహుబలి సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించిన రానా ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న రానా ఓ రిస్కీ ప్రాజెక్ట్ ను ఓకె చేశాడు.చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని మలుపు తిప్పిన దర్శకుడు తేజ, తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో కలిసి చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆలోచనలో పడ్డాడు. కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇటీవల రాజశేఖర్ ప్రధాన పాత్రలో అహం సినిమాను ప్రారంభించాలని ప్రయత్నించాడు. అయితే ఈ సినిమా ఇప్పటికీ చర్చల దశలోనే ఉంది.
అహం సినిమా పట్టాలెక్కక ముందే రానా హీరోగా మరో సినిమాను ప్రారంభిస్తున్నాడు తేజ. ఈ విషయాన్ని రానా స్వయంగా తన ట్విట్టర్ లో ప్రకటించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ వారంలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి చాలా రోజులుగా అహం సినిమా కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్ ఈ వార్త పై ఎలా స్పందిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







