కబాలి వెనుకే కొడి..
- May 10, 2016
యువ నటుడు ధనుష్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన రజనీకి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఇక రజనీ వెనుకే ధనుష్ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదేదో రాజకీయ అంశంగా భావించాల్సిన అవసరం లేదు.రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం జూన్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్ర వేనుకే ఆయన అల్లుడు ధనుష్ చిత్రం కొడి తెరపైకి రావడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. రజనీ చిత్రం కబాలి అంత కాకపోయినా ధనుష్ కొడి చిత్రం పైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. కారణం ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం కావడమే.మరో విషయం ఏమిటంటే ధనుష్ ఇందులో తొలిసారిగా ద్విపాత్రాభినం చేయడం. తన సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న కొడి చిత్రంలో ఆయనకు జంటగా త్రిష, ప్రేమమ్ చిత్రం ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఎదునీశ్చల్, కాక్కీసట్టై వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు దురెసైంథిల్‌కుమార్ తాజా చిత్రం కొడి. చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.త్వరలోనే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోనున్న కొడి చిత్రాన్ని రంజాన్ పండగ సందర్భంగా జూలైలో విడుదల చేయడానికి ధనుష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.విశేషం ఏమిటంటే ఇంతకు ముందు ధనుష్ నటించిన వేలై ఇల్లా పట్టాదారి,మారి చిత్రాలు 2014, 2015 ఏడాదిలో రంజాన్ పండగ సందర్భం గా విడుదలై విజయాన్ని అందుకున్నాయి. అదే సెంటిమెంట్‌ను ధనుష్ తాన తాజా చిత్రం కొడికి వర్తింపజేయడానికి రెడీ అవుతున్నారని భావించవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







