మీ వాట్సాప్‌కి కూడా ఫేక్ కాల్స్ వస్తున్నాయా..?
- May 12, 2023
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లలో కొందరికీ అప్పుడప్పుడు ఫేక్ కాల్స్, స్పామ్ మెసేజెస్ వస్తుంటాయి. తెలిసీ తెలియక కాల్ లిఫ్ట్ చేసినా, మెసేజ్లోని లింక్‌లపై క్లిక్ చేసినా మోసపోయినట్లే. క్షణాల్లో ఫోన్ హ్యాక్ కావడం లేదా బ్యాంక్ బ్యాలన్స్ మాయమవడం జగిరిపోతుంది. అంతేనా..? మీ వాట్సాప్‌లోని చాట్లతో పాటు, యాప్ వాయిస్, వీడియో కాల్లకు కూడా యాక్సెస్ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని వారాలుగా +84, +62, +60 వంటి పలు అంతర్జాతీయ నంబర్ల నుంచి కొన్ని స్పామ్ కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ వాట్సాప్ యూజర్లే ఇందుకు టార్గెట్‌గా మారారు. అంతర్జాతీయ స్పామ్ కాల్స్ గురించి వచ్చిన నివేదికలపై భారత ప్రభుత్వం వాట్సాప్‌కు నోటీసు కూడా పంపుతోంది. ఇక ఈ ఫేక్ కాల్స్ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో చాలా మందికి తెలియదు.
అయితే మీరు తెలియని నంబర్ల నుంచి వచ్చే అన్ని రకాల కాల్స్‌కు చెక్ పెట్టేయోచ్చు. వాట్సాప్ ప్రస్తుతం గుర్తుతెలియని కాల్స్‌ను సైలెంట్ చేసేందుకు ఓ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వాట్సాప్ రెగ్యులర్ యూజర్లు అందరికి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.
ఆ ఫీచర్‌ని ఎలా ఆన్ చేయాలంటే..
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ ఓపెన్ చేసి.. కార్నర్లో ఉన్న త్రి డాట్స్ మెనుపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ‘Settings’ ఓపెన్ చేసి అందులోని ‘Privacy’పై క్లిక్ చేయండి. అందులోని ‘Calls’పై నొక్కి వాట్సాప్‌లో గుర్తు తెలియని కాల్‌లను సైలెంట్ చేసేందుకు టోగుల్ను ప్రారంభించండి. అలా అన్ని రకాల గుర్తు తెలియని కాల్‌లను సైలెంట్ చేయొచ్చు. అయితే మీరు ఏదైనా కాలర్ నంబర్‌ను సేవ్ చేయకుంటే ముఖ్యమైన కాల్స్ మిస్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంది. అలాగే మీరు ఈ ఫీచర్ పెట్టుకున్నప్పటికీ స్పామర్లు మీకు కాల్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే స్కామర్లు కాల్ చేసినప్పుడు మీకు తెలియదు అంతే.. ఫలితంగా మీరు వాటిని లిఫ్ట్ చేయలేదు. తద్వారా మోసపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







