తిరుమలలో భారీ వర్షం
- May 18, 2023
తిరుమల: తిరుమలలో భారీ వర్షం కురిసింది. గత కొద్దీ రోజులుగా విపరీతమైన ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా.. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా.. క్యూ లైన్లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా తీవ్రవస్థలు పడ్డారు.
అప్పటి వరకు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయిన భక్తులు సేదతీరారు. దాదాపు 30 నిమిషాలపాటు పడిన వర్షంతో.. తిరుమల కొండలపై చల్లని గాలులు వీచాయి. తడిస్తే తడిశాం.. ఎండ నుంచి రిలాక్స్ అయ్యాం అంటూ కొంత మంది భక్తులు వర్షంలో తడుస్తూనే నడుచుకుంటూ గదులకు వెళ్లారు. రెండు వారాలుగా తిరుమల కొండపై ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. 40 డిగ్రీలపైనే ఎండ తీవ్రత ఉంటుంది. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పడిన వర్షానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







