అమెరికాలో ఘోర ప్రమాదం: ఎల్ సాల్వడార్ స్టేడియంలో తొక్కిసలాట
- May 21, 2023
అమెరికా: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సాకర్ మ్యాచ్ జరుగుతుండగా అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగిన ఘటన మే 20 న ఎల్ సాల్వడార్ స్టేడియంలో చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాట లో 9 మంది చనిపోగా మరి కొంతమందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని.. బాధితులందరూ 18 ఏళ్లు పైబడిన వాళ్లేనని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన లో గాయపడిన వారిని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మాన్యుమెంటల్ స్టేడియంలో లోకల్ జట్టు అలియాంజా, శాంటా అనా జట్టు(FAAS) మధ్య జరిగిన మ్యాచ్ కు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మ్యాచ్ ప్రారంభమైన 16 నిముషాలకే అభిమానులు స్టేడియంలోకి ఒక్కసారిగా దూసుకురావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. గేట్లు మూసివేసిన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు పోటెత్తడం తో తొక్కిసలాట జరిగింది. కొంతమంది అభిమానులు నకిలీ టిక్కెట్లను కొనుగోలు చేసి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనిపైన విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







