కేశ సంబంధ సమస్యలు గల కారణాలు..
- May 11, 2016
జుట్టు రాలడం అనేది పలచబడడం దగ్గర నుంచి బట్టతల రావడం వరకూ ఉండవచ్చు. వైద్య పరంగా క్రింది విధంగా విభజించవచ్చు.
మందుల వల్ల కలుగు దుష్పలితం
జబ్బు లక్షణాలు
స్త్రీలలో జుట్టు రాలిపోవడం ముందు బాగం మొదలు కొని కణతల వైపు నుంచి వెనక్కు వెళుతుంది. తల పైభాగంలో తక్కువగా కనబడుతుంది.ప్రతి రోజు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజం.ఇంత కన్న ఎక్కువ రాలిన పక్షంలో వైద్య సలహా అవసరం. జుట్టు పలుచబడ్డట్టు అనిపించినా,ఒకటి కంటే ఎక్కువ చోట్ల బట్టతల కనపడ్డా వైద్య సలహా తీసుకోవాలి.చక్కని ఒత్తై జుట్టు కావాలని కోరుకోని వారు ఎవరుంటారు..! అలా నిగనిగలాడే అందమైన జుట్టు మన దైనందిన జీవితంలో తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది.తీసుకునే ఆహారం, తాగే నీరు, నివసించే ప్రదేశం, వాతావరణ మార్పులు, మానసిక, శారీరక సంబంధ సమస్యలు కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తాయి. వీటన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం శరీరానికీ అనుగుణంగా మార్చుకుంటూ. పౌష్టికాహారం, తాజా పండ్లు, కూరగాయలు, వ్యాయామం, యోగా మెడిటేషన్, రోజుకు కనీసం ఏడెనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర వల్ల చాలా వరకు కేశ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. జుట్టు ఊడిపోవడానికి హార్మోన్ సమస్యలు, సర్జరీ, కేన్సర్, దానికి ఇచ్చే కీమోథెరపీ తదితర కారణాలుంటాయి. అధిక మొత్తంలో వెంట్రుకలు ఊడటం, లేదంటే తలలో కొన్ని భాగాల్లో (ప్యాచెస్) మాత్రమే ఊడిపోవడాన్ని హెయిర్ లాస్ అనవచ్చు. సాధారణంగా రోజుకు 60- 70 వెంట్రుకలు సగటు మధ్యవయస్సు వారికి ఊడవచ్చు.
ఈ కేశ సంబంధ సమస్యలు రెండు రకాలు :
1. పురుష సంబంధ బట్టతల : ముందు నుంచి వెనుకకు పొయ్యే వెంట్రుకల సమూహం. ముఖ్యంగా 25% మంది పురుషుల్లో ఈ సమస్య ఉంటుంది. 30 ఏళ్ల వయసు వారికి ఇది రావచ్చు.
2. స్త్రీ సంబంధ బట్టతల : వంశపారంపర్యంగా వయసు, హార్మోన్ల లోపాలు, పీరియడ్స్ ఆగిపోవడం, తల ముందు భాగంలో అలాగే ఉండి. మిగిలిన మొత్తం భాగంలో పలుచబడుతుంది.
కారణాలు
కారణాన్నిబట్టి చికిత్స
ప్రతిరోజూ చికిత్సకు వచ్చే వాళ్లలో ముఖ్యంగా స్త్రీలు దీని గురించి బాగా చింతపడుతూ ఉంటారు. హోమియోలో వ్యాధి కారణాన్ని బట్టి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. గర్భవతిగా ఉన్నపుడు, కాన్పు తర్వాత వచ్చే హార్మోన్ సమస్యలను సరిచేయటం, పోషకాహార సమస్యలు, ఏదైనా విటమిన్, రక్తహీనత సరిచేసే మందులతో పాటు నేట్రంమూర్, పల్సటిల్లా, ఆర్నికా, జబొరాండి, సెపియా తదితర మందులు బాగా పనిచేస్తాయి. వీటిని డాక్టరు సలహా మేరకు తీసుకోవాలి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







