జ్యోతిలక్ష్మిపై పుస్తకం ఆవిష్కరణ
- May 11, 2016
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి కథానాయికగా నటించిన చిత్రం 'జ్యోతిలక్ష్మి'. ఈ చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని రచయిత్రి మంగళ గౌరి కేవలం మూడు రోజుల్లో జ్యోతిలక్ష్మి అనే పుస్తకాన్ని రచించారు. ఇవాళ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నటుడు తనికెళ్ల భరణి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఛార్మి, పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ, సత్య, శాండీ, సునీల్ కశ్యప్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ... సినిమాని చూసి పుస్తకం రాయడం ఇదే ప్రప్రథమం అన్నారు. పీహెచ్డీ గ్రంథాన్ని ఎలా పరిశోధన చేసి రాస్తారో... అదే స్థాయిలో మంగళ గౌరి ఈ పుస్తకాన్ని రాశారని తెలిపారు.
తాను నటించిన సినిమాపై పుస్తకం రావడం ఆనందంగా ఉందని, పూరీ లేకపోతే ఈ సినిమా లేదని నటి ఛార్మి అన్నారు. ఈ సినిమా చేసిన తరువాత దుబాయ్, యూఎస్ ఇలా ఎక్కడికి వెళ్లినా తనని జ్యోతిలక్ష్మీ అని పిలుస్తున్నారని ఛార్మి తెలిపారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మి నటించిన 'మిథునం' చిత్రంపై కూడా ఓ పుస్తకం రాయనున్నట్లు రచయిత్రి మంగళ గౌరి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







