వలసదారులపై 'బ్యాన్' ఎకానమీ వృద్ధి చెందేదాకా
- May 11, 2016
వలసదారులకు రెండేళ్ళ ఎంప్లాయ్మెంట్ బ్యాన్ ఒమన్‌లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా కొనసాగే అవకాశముంది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసి) లేకుండా ఉద్యోగాల్ని వదిలేసుకునేవారిపై రెండేళ్ళ బ్యాన్ కొనసాగుతోంది. ఈ బ్యాన్, ఒమన్‌లో ఎకానమీ మెరుగుపడేదాకా ఉండొచ్చని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీలు వలసదారులకు ట్రెయినింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నాయని అయితే ఎక్కువ జీతాలు వస్తున్నాయనే ఆలోచనతో వలసదారులు వేరే కంపెనీల్లోకి వెళ్ళిపోతున్నారని అలాంటివారి విషయంలో ఈ బ్యాన్ చాలా బాగా ఉపయోగపడ్తుందని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. లేబర్ మార్కెట్‌ని ఈ రెండేళ్ళ బ్యాన్ రూల్ నిలకడగా ఉంచుతుందని ఓ అధికార చెప్పారు. యజమాని అంగీకరిస్తేనే వలసదారుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారడానికి వీలుంది. లేని పక్షంలో వలసదారుడు రెండేళ్ళపాటు ఒమన్‌లో పనిచేసేందుకు అనర్హుడు. ఒమన్‌లో ప్రస్తుతం 30,000 మందికి పైగా ఒమనీయులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. చమురు ధరల పతనంతో ఆర్థికంగా దేశానికి ఇబ్బందికర పరిస్థితి. ఈ తరుణంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందని ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మెంబర్ అహ్మద్ అల్ హూటి చెప్పారు. ఎన్ఓసి పద్ధతి ద్వారా ప్రొఫెషనల్స్‌కి ఇబ్బంది ఉండదని, ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు మారేవారికే ఇబ్బంది అని ఇండస్ట్రీ వర్గాలు వివరించాయి. అయితే ఈ బ్యాన్ కారణంగా వర్క్ ఫోర్స్ తగ్గడం, తద్వారా ప్రొడక్టివిటీ తగ్గిపోతుందనే వాదనలూ తెరపైకొస్తున్నాయి. ఏదేమైనా ఒమన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేదాకా రెండేళ్ళ బ్యాన్ వలసదారులపై తప్పకపోవచ్చు.
తాజా వార్తలు
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి







