అంతర్జాతీయ వేదికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన ఇండియా,కువైట్

- June 02, 2023 , by Maagulf
అంతర్జాతీయ వేదికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన ఇండియా,కువైట్

కువైట్: భారతదేశం, కువైట్ మధ్య ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ వేదికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై సంప్రదింపులు కువైట్ నగరంలో జరిగాయి. కువైట్ తరఫున అంతర్జాతీయ సంస్థల సహాయ మంత్రి అబ్దుల్ అజీజ్ సౌద్ మహ్మద్ అల్-జరల్లా చర్చలకు నాయకత్వం వహించగా.. భారత ప్రతినిధి బృందానికి యూఎన్ పొలిటికల్ జాయింట్ సెక్రటరీ ప్రకాష్ గుప్తా, కువైట్‌లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా నాయకత్వం వహించారు. రెండు దేశాల మధ్య ఈ తరహా సంప్రదింపులు ఇదే మొదటిది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి  సహా ఇతర అంతర్జాతీయ సంస్థలలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. నామ్(NAM), G-77 ఫ్రేమ్‌వర్క్‌లో సహకారంతో సహా బహుపాక్షిక వేదికలపై పరస్పర ఆసక్తి ఉన్న రంగాలపై ఇరు దేశాల నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని అధికార యంత్రాంగం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com