ఐదేళ్ల కొడుకు తుపాకి కాల్చడం ఎలాగో నేర్పిస్తే!!
- May 12, 2016
ఇస్తాంబుల్
పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు నాన్న వేలు పట్టుకుని నడుస్తారు. నడక, నడత రెండూ నాన్న దగ్గరే చాలామంది నేర్చుకుంటారు. ఆ తండ్రి ఏం నేర్పితే పిల్లలు అదే నేర్చుకుంటారు. కానీ అలాంటి తండ్రి.. పిల్లాడి వేలు పట్టుకుని తుపాకి కాల్చడం ఎలాగో నేర్పిస్తే!! అవును.. టర్కీలో సరిగ్గా ఇలాగే జరిగింది. పూర్తిగా లోడ్ చేసిన ఒక పిస్టల్ తీసుకుని, దాన్ని ఎలా కాల్చాలో తన ఐదేళ్ల కొడుకుకు నేర్పిస్తున్న తండ్రి ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైపెచ్చు ఆ వీడియోను ఆ తండ్రే స్వయంగా షేర్ చేశాడు.తుపాకి కాల్చడం ఎలాగో చెప్పడానికి ముందు దాన్ని లోడ్ చేసి, ఐదేళ్ల కొడుక్కి దాన్ని పట్టుకొమ్మని చెప్పాడు. 'నువ్వు నాన్న కొడుకువేనని చూపించు' అని చెప్పాడు. రెండు చేతులతో తుపాకి ఎలా పట్టుకోవాలో అతడు చెప్పిన తర్వాత.. పిల్లాడు నెమ్మదిగా దాన్ని పైకెత్తి, ఐదుసార్లు కాల్చడం వీడియోలో కనిపిస్తుంది.ప్రతిసారీ ట్రిగ్గర్ నొక్కు.. అంటూ పిల్లాడికి సూచనలు ఇస్తుంటాడా తండ్రి. మ్యాగజైన్ మొత్తం ఖాళీ అయ్యాక 'వీడు సరైన మగాడు.. ఇది ఆడవాళ్లకు గుణపాఠం కావాలి' అని చెబుతాడు. ఈ మొత్తం వీడియోను షూట్ చేసిన వ్యక్తి కూడా ఆ తర్వాత పిల్లాడిని అభినందిస్తాడు. దీనిపై టర్కీలో ఇప్పుడు వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







