'సుప్రీమ్‌' చిత్రాన్ని దివ్యాంగులు థియేటర్లలో ఉచితంగా..

- May 12, 2016 , by Maagulf
'సుప్రీమ్‌' చిత్రాన్ని దివ్యాంగులు థియేటర్లలో ఉచితంగా..

తాను నటించిన 'సుప్రీమ్‌' చిత్రాన్ని ఈ శుక్రవారం నుంచి దివ్యాంగులు థియేటర్లలో ఉచితంగా చూడవచ్చని హీరో సాయిధరమ్‌తేజ్‌ అన్నారు. ఈ విషయాన్ని సాయిధరమ్‌తేజ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... రెండు పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. రాశీఖన్నా చిత్రంలో కథానాయకిగా నటించారు. ఇందులో సాయిధరమ్‌తేజ్‌ టాక్సీ డ్రైవరుగా, రాశీఖన్నా పోలీసు అధికారిణిగా కనిపించారు.
అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా దివ్యాంగుల కోసం ఈ చిత్రం ప్రత్యేక స్క్రీనింగ్‌ను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com