తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- June 03, 2023
దోహా: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో తెలంగాణ ఆవిర్భావం దినోత్సవ వేడుకలు దోహ ఖతార్ లో తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.
మొదటగా తెలంగాణ గల్ఫ్ సమితి ఎన్నికైన నూతన కార్యవర్గానికి ప్రమాణస్వీకారం చేయడం జరిగింది, అనంతరంసంబరాల్లో భాగంగా ప్రముఖ జానపద గాయకురాలు సింగర్ స్ఫూర్తి జితేందర్ అతిథిగా హాజరై తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఎంబసీ ఖతర్ ఫస్ట్ సెక్రటరీ మరియు ఐ.సి బి.ఎఫ్ కోఆర్డినేటర్ సుమన్ సోనుకర్ ముఖ్య అతిథిగా ఐ.సి.బి.ఎఫ్ ప్రెసిడెంట్ షాన్వాస్ బావ,ఐసిసి వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, ఎస్.సి.బి.ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ శెట్టి, ఐసీసీ జనరల్ సెక్రెటరీ మోహన్ కుమార్, తెలుగు కమ్యూనిటీ సీనియర్ కోడూరి ప్రసాద్ రావు, తెలుగు కమిటీ సీనియర్ లీడర్ కృష్ణ కుమార్ ఐసీసీ అడ్వైజర్ నెంబర్ నందిని అబ్బ గౌని ఐసిబిఎఫ్ కమిటీ మెంబర్ సుందరగిరి శంకర్ గౌడ్ మరియు మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తెలుగు సంఘాల అధ్యక్షులు మరియు తెలుగు సంఘాల నాయకులు అందరూ పాల్గొని తెలంగాణ గల్ఫ్ సమితి కథలు వారు చేస్తున్న కార్యక్రమాలను గుర్తు చేస్తూ కొనియాడారు.
తెలంగాణ గల్ఫ్ సమితి కొత్త కార్యవర్గంలో అధ్యక్షుడు మధు కుమార్, ఉపాధ్యక్షుడు గడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి గా వంశీ సాయి గిరి, సంధ్యారాణి, ప్రియాంక, గోలి శ్రీనివాస్,సుధాకర్,సంజీవ్,మహమ్మద్ అజిమ్, కారం మారుతి, మను ఎన్నికయ్యారు ఇట్టి కార్యక్రమంలో దాదాపు తెలంగాణ ప్రజలు 500 పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







