ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన..
- June 04, 2023
న్యూ ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం అయ్యారు. హస్తినలోని అమిత్ షా నివాసంలో 50 నిముషాల పాటు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం కొనసాగింది. ఏపీ, తెలంగాణ సహా జాతీయ రాజకీయ అంశాలు, పొత్తులపై జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు చర్చించారు. పొత్తులు, ఎన్డీఏలో భాగస్వామ్యంపై ప్రాధమిక చర్చలు జరిగినట్లు సమాచారం.
భవిష్యత్ లో మరిన్ని సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ రానుంది. టీడీపీని కలుపుకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం పెరుగుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం పెద్దలతో చంద్రబాబు భేటీపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు.
కాగా, ఐదేళ్ల తర్వాత బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్.. ఏపీలో పోటీ చేస్తుంది కాబట్టి కలిసి వెళ్తే రెండు రాష్ట్రాల్లో ప్రయోజనం ఉంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, విపక్షాల ఐక్యత కసరత్తు నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







