బ్రహ్మానందం చేతుల మీదుగా అన్ స్టాపబుల్ ట్రయిలర్ లాంచ్
- June 04, 2023
హైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అన్ స్టాపబుల్. ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. ఈ ట్రయిలర్ రిలీజ్ వేడుకకు హాస్యనటులు బ్రహ్మానందం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ట్రయిలర్ లాంచ్ అయింది. విజె సన్నీ, సప్తగిరి మంచి స్నేహితులు, వారికి డబ్బు అవసరం. మరోవైపు మిస్సయిన డ్రగ్స్ ప్యాకెట్స్ కోసం విలన్ అన్వేషణలో ఉంటాడు. సన్నీ, సప్తగిరి 100 కోట్ల విలువైన డ్రగ్స్ ని కనుగొంటారు. ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోలు, ఆ సింగిల్ విలన్ మధ్య ఏం నడిచింది, ఎంత కామెడీ పుట్టిందనే కోణంలో ట్రయిలర్ ను కట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







