తిరుపతి మహానాడుకు 30 వేల మందికి ఆహ్వానాలు
- May 12, 2016
ఈ నెల 27వ తేదీ నుంచి తిరుపతిలో జరగబోయే మహానాడుకు ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని 30 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు చెప్పారు. గురువారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బస్టాండ్ సెంటర్లోని హోటల్ ఇంటర్నేషనల్‌లో జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రాష్ట్ర కమిటీ ప్రతినిధులు.. అతిథులకు గదులు, భోజనాల కల్పన, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. టీటీడీ గదులు, కల్యాణ మండపాలు, అతిథి గృహాలను 20వ తేదీలోగా రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. అంతకుముందు నాయకులు స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానానికి చేరుకుని వేదిక నిర్మాణానికి అనువైన చోటును ఎంపిక చేశారు. వాహనాల పార్కింగ్, మంచినీరు, టాయిలెట్స్, భోజన వసతుల కల్పనపై కళా వెంకట్రావు జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇన్చార్జి మంత్రి నారాయణలతో మాట్లాడారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







