యూఏఈలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
- June 08, 2023
యూఏఈ: ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం (ఏటికే) మరియు భారత జాగృతి యూఏఈ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను తేది 04/06/2023 ఆదివారం రోజున అజ్మన్ లోని హాభిటాట్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది ప్రవాసీయులు పాల్గొనడం జరిగింది.
ముందుగ జాతీయ గీతం ఆలపించి వేడుకలను ప్రారంభించారు.తొలిదశ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ నిరధిని స్మరిస్తూ అమరులారా వందనం వీరులారా వందనం అంటూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అమరవీరుల స్థూపం యొక్క గొప్పతన్నాని , చరిత్రను , ఉద్యమంలో వారి పాత్రను కొనియాడుతూ 2 నిముషాలు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త కీర్తి శేషులు ప్రొఫెసర్ జయశంకర్ కృషిని వారు ఉద్యమానికి అందించిన బలాన్ని , తోడ్పాటును గుర్తు చేసుకోవడం జరిగింది, కొమరం బీమ్, చాకలి ఐలమ్మ , నారాయణ రెడ్డి , శ్రీకాంత చారి, యాదయ్య , కిష్టయ్య లాంటి అమరులను స్మరించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర సాధనకై వివిధ దేశాలలో కృషి చేసిన ప్రవాసీ సంఘాలకు , ఎన్నారైలకు శుభాకాంక్షలు తెలియచేసారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అప్పట్లో గల్ఫ్ దేశాల్లో ఎన్నో కఠిన చట్టాలు ఉన్న యూఏఈ గడ్డ నుండి 2010 నుండి 2014 వరకు మాతృభూమి లో జరిగిన ఉద్యమానికి సంఘీభావంగా ETCA ఆధ్వర్యంలో నిర్వహించిన యూఏఈ తెలంగాణ ఎన్నారై మీట్ , ధూమ్ ధామ్ , మానవ హారాలు , వంట వార్పు , తెలంగాణ అట పాట , తెలంగాణ విమోచన దినోత్సవాలు , నిరవధిక దీక్ష , మరియు సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ , రైల్ రోకోలలో వంటి కార్యక్రమలలో ETCA సభ్యులు ఇక్కడినుండి వెళ్లి ప్రత్యక్ష్యంగా పాల్గొన్న ఉద్యమ రోజులని గుర్తుకు తెచ్చుకోవడం జరిగింది.
తెలంగాణ చారిత్రక వైభవాన్ని, ఉద్యమ శైలిని తలపించే మాదిరిగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు , కళాకారుల డప్పు చప్పుళ్ళు , జై తెలంగాణ , జోహార్ తెలంగాణ అమర వీరులకి అంటూ నినాదాలతో కార్యక్రమ వేదికను హోరెత్తించాయి. ప్రత్యేకంగా తయారు చేసిన అమరవీరుల స్థూపం అందరిలో ఒక మానసిక ఉద్వేగాన్ని , బాధను నింపడం జరిగింది.
గల్ఫ్ లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పై ETCA సభ్యుల ఆవేదన వ్యక్తం చేసారు. గల్ఫ్ సంక్షేమం పై భారత రాష్ట్ర సమితి పార్టీ ఉద్దేశాన్ని ప్రకటించాలని డిమాండ్, ఉద్యమ కాలంలో, రాష్ట్ర ఏర్పాటులో అండగా నిలిచిన గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత రాష్ట్ర సమితికి గల్ఫ్ ప్రవాసీ బిడ్డలా మద్దతు అక్కర్లేదా ???
యుద్ధప్రాతిపదికన ముఖ్యమంత్రి గల్ఫ్ బిడ్డల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంఘాలతో సమావేశం కావాలని , సాధ్య అసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ పరమైన ప్రక్రియ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ !
5 సంవత్సరాలు ETCA అధ్యక్ష్యుడిగా సేవలు అందించిన రాధారపు సత్యం, ఉపాధ్యక్ష్యులు అరవింద్ రాగం , ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ మాన్యం లకు సభ్యులు అభినందనలు తెలియచేసి సన్మానం చేయడం జరిగింది.
సాంస్కృతిక కార్యక్రమలను ప్రదర్శించిన చిన్నారులకు , మహిళలకు , కళాకారులకు నిర్వాహకులు ప్రశంస పత్రాలను అందించడం జరిగింది , పాల్గొన్న వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ETCA నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు :
అధ్యక్ష్యులు : మామిడి శ్రీనివాస్ రెడ్డి
ఉపాధ్యక్ష్యులు : జగదీశ్ రావు చీటీ
ప్రధాన కార్యదర్శి : వినోద్ ఆచార్యులు
నిర్వాహక కార్యదర్శి : శ్రీనివాస్ ఎలిగేటి
కార్య వర్గ సభ్యులు : శేఖర్ గౌడ్ గుండవేని , ఎస్ పి కస్తూరి , సురేశ్ రెడ్డి అంబటి , జలంధర్ రెడ్డి వెలమ , వేణు గొల్లపెల్లి , చైతన్య చకినం , తిరుమల రావు , తిరుపతి రెడ్డి, సంతోష్ కుమార్ స్థంభంకాడి , రఘు ఎలిగేటి , రాణి కోట్ల ను ప్రకటించడం జరిగింది
సలహాదారులు : కిరణ్ కుమార్ పీచర , సత్యం రాధారపు , అరవింద్ బాబు రాగం , సాయి చందర్ కటకం , పీచర వెంకటేశ్వర్ రావు
మహిళా విభాగం : సరోజ అల్లూరి , దీపిక ఎలిగేటి , సారిక పీచర , మమత కస్తూరి , విపుల దుర్శేటి, లక్ష్మి ఆనంద్
ఈ కార్యక్రమంలో ETCA సభ్యులు కిరణ్ కుమార్ పీచర , రాధారపు సత్యం , మామిడి శ్రీనివాస్ రెడ్డి , జగదీష్ రావు , వినోద్ ఆచార్యులు , శ్రీనివాస్ ఎలిగేటి మరియు భారత జాగృతి యూఏఈ అధ్యక్ష్యులు పీచర వెంకటేశ్వర్ రావు , ఉపాధ్యక్ష్యులు అరె శేఖర్ గౌడ్ మరియు GWPC అధ్యక్ష్యులు గుండెల్లి నర్సింహా మరియు పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా సహకారం అందించిన మూస టూరిజం, మైత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ , బ్లూ మార్క్ టెక్నికల్ సర్వీసెస్, రియల్ టేస్ట్ రెస్టారెంట్ , ఫుడ్ ప్యాక్ మిడిల్ ఈస్ట్ వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్ గా మా గల్ఫ్ వ్యవహరించింది.






తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









