గబగబా అన్నం తింటున్నారా?
- May 12, 2016
ప్రైవేట్ వ్యవస్థల్లో తెల్ల వారి లేచిన దగ్గరనుండి పడుకునే వరకు బిజీ బిజీ లైఫ్. ఎప్పుడూ ఏదో ఒక పనితో కుస్తీ పడుతూనే ఉంటాం. మానసిక ఒత్తిడి, అనారోగ్యం లాంటివి వేలకు సరిగా భోజనం చేయకపోవడం వల్ల దరిచేరుతాయి. అయితే ఈ బిజీ లైఫ్ లో ఏదీ తిన్నా గబగబా తినడం చేస్తూ ఉంటాం. అసలేం తిన్తున్నమే ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. పైగా తీసుకునే ఆహారం ఎక్కువా అవ్వొచ్చు లేదా తక్కువా అవ్వచ్చు. దీని ద్వారా అనేక సమస్యలు రావచ్చు. అయితే ఈసమస్య నుండి బయట పడాలంటే ఈ చిట్కాలను, నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
*సమయాభావం లేకపోవడం వల్ల అన్నం కానీ ఇంకా ఏదైనా కానీ హడావుడిగా తింటున్నామనే కారణాలు మానివేసి తినడానికి రోజూ ఒక సమయాన్ని కేతాయించుకొని, ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా, నిదానంగా తినండి. తొందర తొందరగా తింటే అసలు ఎంత తిన్నాం అనేది తెలియకపోగా, తిన్న దాని రుచిని ఆస్వాదించే అవకాశాన్ని కూడా కోల్పోతాం.
హడావుడిగా అన్నం ముద్దలు మింగేస్తున్నారా? అయితే కాస్త ఆగండి హడావుడిగా తినడం ద్వారా ఎంత తింటున్నామనే విషయం తెలియదు మరోవైపు గాలి కూడా లోపలికి వెళ్లిపోతుంది కొద్దిసేపటికే ఆకలేసేస్తుంది ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బాగా నమిలి తినడం మంచిది అప్పుడు ఎంత తినాలో అంతే తింటాం ఆకలి త్వరగా వేయదు.
* అంతేకాదు నమిలి తినడం వల్ల లాలాజల గ్రంథులు కూడా చురుగ్గా మారుతాయి బాగా నమలడం ద్వారా ఆహారం మెత్తగా మారి జీర్ణవ్యవస్థకు పని తక్కువగా ఉంటుంది త్వరగా జీర్ణమవుతుంది నములుతున్నప్పుడు నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది.
* శరీరంలో మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి.
* ఆహారాన్ని బాగా నమిలి తినడం ద్వారా ఆహారంలోని పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి బరువు తగ్గడం సాధ్యమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. *అన్నం తినేముందు ఒక ఐదు నిముషాలు విరామం తీసుకొని తినబోయే దాని గురించి కాస్త ఆలోచించండి. అప్పుడు మనం ఆన్నం తినడానికి సంసిద్దులవుతున్నామని మన మెదడుకి సమాచారం అందుతుంది. అప్పుడు అది మన శరీరంలో కొన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది. దాని ద్వారా తమకు తినాలనే కోరిక కూడా కలుగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







