'పీపుల్ ఫార్మసీ' పథకాన్ని పునరుద్ధరించిన లూలా
- June 09, 2023
బ్రసీలియా: బ్రెజిల్ అధ్యక్షుడు లూలా 'పీపుల్ ఫార్మసీ' ప్రభుత్వ పథకం కొత్త వెర్షన్‌ను బుధవారం ప్రవేశపెట్టారు. ప్రజలకు మందులను ఉచితంగా, తక్కువ ధరకు అందించనున్నట్లు ప్రకటించారు. చాలా మంది బ్రెజీలియన్లు ప్రిస్కిప్షన్ ఉన్నా మందులు కొనేందుకు డబ్బులేక చనిపోతున్నారని, ఇకపై తమ దేశంలో ఇలా జరగదని స్పష్టం చేశారు. పీపుల్స్ ఫార్మసీ ప్రజలందరి కోసం మరిన్ని మందులతో, ఎక్కువ మంది వైద్యులతో, ఫ్యామిలీ బ్యాగ్ ప్రోగ్రామ్‌తో తిరిగి వస్తోందని అన్నారు. ఈ పథకంతో 40 మందులను ఉచితంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఉచిత కేటగిరీతో పాటు ఇతర ఫార్మసీలలోని ధరలతో పోలిస్తే 90 శాతం వరకు తగ్గింపుతో మందులను అందించనున్నట్లు తెలిపారు. 2004లో లూలా మొదటిసారి బ్రెజిల్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. డయాబెటిస్, ఆస్థమా, హైపర్ టెన్షన్ సహా 13 రకాల మందులను ప్రజలు ఉచితంగా పొందే అవకాశం కలిగించారు. అనంతరం బోల్సెనారో ప్రభుత్వం ఈ పథకం పరిధిని తగ్గించింది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









