హైదరాబాద్: ప్రియురాలిని హత్య చేసి..మ్యాన్ హోల్ లో పూడ్చి పెట్టిన పూజారి
- June 09, 2023
హైదరాబాద్: శంషాబాద్ లో దారుణం జరిగింది. అప్సరా అనే అమ్మాయిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని సరూర్ నగర్ వద్దకు తీసుకొని మురికి కాలువలో పడేసి మట్టితో పూడ్చిపెట్టాడు పూజారి సాయి. ఆ తర్వాత ఆప్సరా మిస్సింగ్ అయిందంటూ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు. పిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు.
వివరాల్లోకి వెళ్తే..సరూర్‌నగర్‌కు చెందిన పూజారి వెంకట సాయికృష్ణ(36).. అదే ప్రాంతంలో ఉంటున్న అప్సర (30) అనే యువతితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. అయితే సాయికృష్ణకు అప్పటికే వివాహమై ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని సదరు యువతి ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆమెను అడ్డుతప్పించుకోవాలని సాయికృష్ణ ప్లాన్ చేసుకున్నాడు.
ఈ నెల 3న అప్సరను సరూర్‌నగర్ నుంచి కారులో ఎక్కించుకుని శంషాబాద్‌కు తీసుకొచ్చాడు. నార్కుడ వద్దకు వచ్చిన తర్వాత అప్సరకు ట్యాబ్లెట్ ఇచ్చి మత్తులోకి దించాడు. ఆ తర్వాత ఆమె తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కవర్‌లో పెట్టి సరూర్ నగర్ తీసుకొచ్చాడు. అక్కడే ఒక మ్యాన్‌హోల్‌లో పడేశాడు. దాన్ని కాంక్రీట్‌తో పూడ్చేశాడు. ఆ తర్వాత ఏ తెలియనట్లుగా ఈ నెల 5న శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. అప్సర స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్తానని చెప్పడంతో ఆమెను శంషాబాద్ అంబేడ్కర్ విగ్రహం వద్ద డ్రాప్ చేశానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాయికృష్ణపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







