అల్ ఖువైర్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీకి చెక్
- June 09, 2023
మస్కట్: అల్ ఖువైర్ ప్రాంతంలోని విలాయత్ ఆఫ్ బౌషర్‌లోని ప్రధాన సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్‌కు ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్టు మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది. దీంతో సర్వీస్ రోడ్డును వన్‌వే రోడ్డుగా మారుతుందని, దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరతాయని మున్సిపాలిటీ వెల్లడించింది. అదే విధంగా ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గడంతోపాటు శబ్దాన్ని తగ్గించడం, ట్రాఫిక్ సామర్థ్యాన్ని పెంచడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలను మెరుగుపరచడం, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, వంటి లక్ష్యాలు కూడా ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నాయి. అల్ ఖువైర్ స్ట్రీట్, రోడ్ నెం. 3534 కూడలి నుండి మినిస్ట్రీస్ స్ట్రీట్ (వంతెన దిగువన) కూడలి వరకు దాదాపు 6 కిలోమీటర్ల సర్వీస్ రోడ్లను ఒకే దిశలో రెండు లేన్లతో వన్-వే రోడ్లుగా మార్చేందుకు ఈ ప్రాజెక్ట్ ను రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్‌కు సర్వీస్ రోడ్డుతో పాటు రోడ్డు మధ్యలో, అలాగే సర్వీస్ రోడ్డు చివరిలో అదనపు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి రెండు అదనపు ఎంట్రీ పాయింట్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అనేక సైడ్ రోడ్లను వన్-వే రోడ్లుగా మార్చుతారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, కొత్త కాలిబాటల నిర్మాణం, మెరుగైన పార్కింగ్ సౌకర్యాలు, యుటిలిటీ పనులు మరియు హెచ్ఎస్బిసి బ్యాంక్ భవనానికి ఆనుకుని ఉన్న కాలువపై కొత్త రోడ్డు లింక్‌ను నిర్మించడం ఈ ప్రాజెక్ట్‌లోని భాగంగా ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







