షార్క్ దాడిలో రష్యన్ మృతి
- June 10, 2023
కైరో: ఈజిప్టు ఎర్ర సముద్రపు రిసార్ట్ వద్ద బీచ్ సమీపంలో ఈత కొడుతున్న ఒక రష్యన్ పౌరుడిపై షార్క్ దాడి చేసింది. ఈ ఘటనలో రష్యన్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం సముద్రంలో ఈత కొట్టడాన్ని అధికారులు నిషేధించారని ఈజిప్షియన్, రష్యన్ మీడియా తెలిపింది. ఈజిప్టు తూర్పు తీరంలోని ప్రముఖ పర్యాటక నగరం హుర్ఘదాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 1999లో జన్మించిన ఒక రష్యన్ జాతీయుడు "షార్క్ దాడిలోమరణించాడు" అని రష్యా కాన్సుల్-జనరల్ విక్టర్ వోరోపాయెవ్ ప్రకటించారు. కాగా, ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఈజిప్టు పర్యావరణ మంత్రి యాస్మిన్ ఫౌద్ వెల్లడించారు. అయితే, ఎర్ర సముద్రం బీచ్‌లో సంఘటనకు కారణమైన "టైగర్ షార్క్" ప్రత్యేక బృందాలు పట్టుకోగలిగాయని, దాడికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని యాస్మిన్ ఫౌద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







