పవన్ హీరోగా వేదలం రీమేక్ కు ప్రయత్నాలు.
- May 12, 2016
సర్థార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ తో ఆలోచనలో పడ్డ పవన్ కళ్యాణ్ తనకు బాగా కలిసొచ్చిన ఫార్ములాను ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలు తమిళ దర్శకులతోనే కలిసి పనిచేశాడు. అంతేకాదు పవన్ కు పవర్ స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టిన ఖుషి లాంటి సినిమాలు రీమేక్ గా తెరకెక్కినవి. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా విషయంలో ఈ రెండు ఫార్ములాలను ఉపయోగిస్తున్నాడు పవన్.తన ప్రతి సినిమాకు గ్యాప్ తీసుకునే పవన్, ఈ సారి మాత్రం అలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు. అయితే ఈ సినిమా అజిత్ హీరోగా తమిళ్ లో ఘనవిజయం సాధించిన వీరం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ లుక్స్, స్టైల్ కూడా ఈ టాక్ కు బలం చేకూరుస్తున్నాయి.అయితే ఈ సినిమా తరువాత కూడా పవన్ మరో తమిళ దర్శకుడితో రీమేక్ సినిమాకే అంగీకరించాడట. అజిత్ హీరోగా తెరకెక్కిన వేదలం సినిమాను జిల్లా ఫేం నేశన్ దర్శకత్వంలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ లేకపోయినా.., పవన్ హీరోగా వేదలం రీమేక్ కు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు నేశన్.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







