జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
- June 15, 2023
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు విస్తరించేందుకు రియలన్స్ జియో సంస్థ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఒకేసారి 100 జియో టవర్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ టవర్లను జగన్ ప్రారంభించారు.
కొత్తగా ప్రారంభించిన సెల్‌టవర్లతో మారుమూల ప్రాంతాల నుంచి నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటరాక్ట్ అయ్యారు. ఈ టవర్ల ఏర్పాటుద్వారా 209 మారుమూల గ్రామాలకు జియో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు జియో సిద్ధమైంది. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో మూడు టవర్లు, వైయస్సార్ జిల్లాలో రెండు టవర్లు ఏర్పాటు పూర్తికాగా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ టవర్లకు భవిష్యత్తులో 5జీ సేవలనుకూడా రిలయన్స్ జియో సంస్థ అప్‌గ్రేడ్ చేయనుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







