కల తీరిందంటున్న "సరైనోడు"
- May 13, 2016
అల్లు అర్జున్ ''గీతా ఆర్ట్స్ సంస్థలో కొన్ని సినిమాలు చేసినా, సరైన విజయం సాధించలేకపోయా అనే లోటు ఉండేది. దాన్ని 'సరైనోడు' తీర్చేసింది' అంటున్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'సరైనోడు'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి 20 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ సాధించింది. బన్నీ సినిమాల్లో 'రేసుగుర్రం' తరవాత వంద కోట్లు తెచ్చుకొన్న చిత్రమిదే. ఈ సందర్భంగా సితారతో అల్లు అర్జున్ మాట్లాడుతూ ''నా సినిమాలు ఓవర్సీస్‌లో, నైజాంలో మంచి వసూళ్లు దక్కించుకొన్నాయి. ఆంధ్రాలోనూ బాగానే ఆడినా టాప్ 5లో నా సినిమా చూసుకోలేకపోయా. ఆ లోటు కూడా 'సరైనోడు' తీర్చింది. ఇదేం 'వూరమాస్' సినిమాకాదు. చాలా స్టైలీష్‌గా తీశాం. నా కోసం రెండు మూడు కోట్లు ఎక్కువ ఖర్చుపెట్టించా. అందుకే సినిమా అంత రిచ్‌గా వచ్చింది. మాస్ పల్స్ ఎలా పట్టుకోవాలో బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు. ఈ సినిమాతో అది మరోసారి రుజువు అయ్యింద''న్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







