6 కిలోల హెరాయిన్‌తో ఫార్మర్ అరెస్ట్
- May 14, 2016
దుబాయ్ పోలీసులు ఆసియాకి చెందిన వ్యక్తిని ఆరు కిలోల హెరాయిన్ కలిగి ఉండగా అరెస్ట్ చేశారు. మే 2న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దుబాయ్ పోలీస్ చీఫ్ ఫర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎఫైర్స్ అసిస్టెంట్ మేజర్ జనరల్ ఖలిల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరీ మాట్లాడుతూ, ఫార్మర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డాడనీ, అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి పంపడం జరిగిందనీ, హెరాయిన్‌ని కలిగి ఉన్నందుకు, దాన్ని విక్రయిస్తున్నందుకు అతనిపై కేసులు నమోదు చేశామని అన్నారు. ఇంట్లోని ఫాల్స్ సీలింగ్‌లో నార్కోటిక్స్‌ను దాచి ఉంచాడు. దుబాయ్‌లోని అల్ జఫ్లియా ఏరియాలో ఇతను నివసిస్తున్నాడు. అతను డ్రగ్స్‌ని విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు అతని ఇంట్లో తనిఖీ చేసి, రెడ్ హ్యాండెడ్‌గా నిందితుడ్ని పట్టుకున్నారు. 6.4 కిలోల హెరాయిన్‌ని బ్లాక్స్ మరియు క్యాప్స్యూల్స్ రూపంలో ఉంచాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







