జపాన్‌తో యూఏఈ స్పేస్‌ ఏజెన్సీ ముందడుగు

- May 14, 2016 , by Maagulf
జపాన్‌తో యూఏఈ స్పేస్‌ ఏజెన్సీ ముందడుగు

యూఏఈ స్పేస్‌ ఏజెన్సీ, జపాన్‌ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఇది స్పేస్‌ ఎక్స్‌ప్లరేషన్‌లో ఇరు దేశాల మధ్యా సహాయ సహకారాలకు సంబంధించి కీలకమైన ముందడుగుగా ఇరు దేశాల ముఖ్యులూ అభివర్ణించారు. రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌, హ్యూమన్‌ క్యాపిటల్‌ డెవలప్‌మెంట్‌, డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ రిలేటెడ్‌ ఇండస్ట్రీస్‌ విభాగాల్లో ఈ ఒప్పందం ఎంతో ఉపకరిస్తుంది. స్పేస్‌ రీసెర్చ్‌కి సంబంధించి ఎడ్యుకేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌, స్పేస్‌ ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకోవడం, స్టడీస్‌ మరియు రీసెర్చ్‌, అలాగే స్పేస్‌ సెక్టార్‌ విజిట్స్‌లో ప్రోత్సాహం, కాన్పరెన్స్‌లు, లెక్చర్స్‌ లాంటి అంశాల్లోనూ ఇరు దేశాలూ కలిసి పనిచేస్తాయి. యూఏఏఈ స్పేస్‌ ఏజెన్సీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఖలీఫా అల్‌ రుమైతి మాట్లాడుతూ, జపాన్‌తో స్పేస్‌ రంగంలోనే కాకుండా ఇతరత్రా రంగాల్లోనూ కలిసి పనిచేస్తామని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com