రియాద్ ఎయిర్ లో 700 మంది పైలట్ల నియామకం
- July 11, 2023
సౌదీ: సౌదీ అరేబియా కొత్త విమానయాన సంస్థ రియాద్ ఎయిర్ రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. 2025లో టేకాఫ్ చేయడానికి సన్నద్ధమవుతున్నందున పైలట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. బోయింగ్ విమానాలను నడపడంలో శిక్షణ పొందిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని రియాద్ ఎయిర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పీటర్ బెల్లూ తెలిపారు.
కింగ్డమ్ సావరిన్ వెల్త్ ఫండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) ద్వారా ప్రారంభించబడిన ఎయిర్‌లైన్, ఏప్రిల్ 2023లో బహుళ-బిలియన్ డాలర్ల ఒప్పందంలో 72 బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాలను ఆర్డర్ చేసింది. మొత్తంగా 330 మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించడం, 2030 నాటికి 100 మిలియన్ల సందర్శనలను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో భాగంగా బోయింగ్ చరిత్రలో ఐదవ-అతిపెద్ద ఒప్పందం చేసుకుంది. ఇంటర్వ్యూ ప్రక్రియ సెప్టెంబరు 2023లో ప్రారంభమవుతుందని, జనవరి 2024లో వ్యక్తులను అధికారికంగా చేర్చడాన్ని ఎయిర్‌లైన్ ప్రారంభిస్తుందని బెల్లెవ్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







