యూఏఈ అధ్యక్షుడు హిందీలో ట్వీట్....భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం
- July 15, 2023
యూఏఈ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్న సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు అబుధాబికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకడం నాకు చాలా ఆనందంగా ఉందని యూఏఈ అధినేత హిందీలో ట్విట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా గత పర్యటన నాటి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. "మా ద్వైపాక్షిక సంబంధాల యొక్క కొనసాగుతున్న పురోగతి, స్థిరమైన ప్రపంచ వృద్ధిని ప్రోత్సహించడంలో మా భాగస్వామ్య ఆసక్తి, మా దేశాలు మరియు మన ప్రజల మధ్య సహకారాన్ని మరింత పెంచే మార్గాల గురించి మేము చర్చించాము." అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు స్థానిక కరెన్సీలలో వాణిజ్య పరిష్కారాన్ని ప్రారంభించాయి. ఈ మేరకు అబుధాబిలో ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో రెండు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కురుర్చుకున్నారు. క్రాస్ బోర్డర్ లావాదేవీలు మరియు చెల్లింపులను సులభతరం చేయడం, భారతదేశం-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య గొప్ప ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందాల లక్ష్యం.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







