దిల్ రాజ్ చేతుల మీదుగా ‘నాతో నేను’ ట్రైలర్ లాంచ్
- July 18, 2023
హైదరాబాద్: సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న సినిమా నాతో నేను. జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ తూర్లపాటి దర్శకుడిగా మారి ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రశాంత్ టంగుటూరి ‘నాతో నేను’ సినిమాని నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు శ్రోతలను అలరిస్తున్నారు.
ఈ నెల 21న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘నాతో నేను’ ట్రైలర్ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ట్రైలర్లో ట్రయాంగిల్ ఎమోషన్స్ చూపించారు. చాలా బావుంది. సాయికుమార్ నటన గురించి అందరికీ తెలిసిందే. ఆయనతోపాటు ఆర్టిస్టులు అద్భుతంగా నటించారు. టీమ్‌కి ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.
శాంతికుమార్ మాట్లాడుతూ.. జబర్దస్త్ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. ప్రేమ, భావోద్వేగం అన్ని ఉన్న చిత్రమిది అని అన్నారు.
నాతో నేను చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఇటీవల విడుదల చేసిన పాటలు అన్నింటికి చక్కని స్పందన వచ్చింది. ఈ నెల 21 ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం అని నిర్మాత ప్రశాంత్ టంగుటూరి తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







