క్లీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి, ఎగుమతిలో సౌదీ టాప్..!

- July 24, 2023 , by Maagulf
క్లీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి, ఎగుమతిలో సౌదీ టాప్..!

గోవా: క్లీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతిలో సౌదీ అరేబియా నాయకత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ తెలిపారు. భారతదేశంలో జరిగిన గ్రీన్,  తక్కువ-కార్బన్ హైడ్రోజన్‌పై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. గోవాలో జరిగిన 14వ క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్, 8వ మిషన్ ఇన్నోవేషన్ సమావేశాల సందర్భంగా జరిగిన డైలాగ్ సెషన్‌లో కూడా ఇంధన మంత్రి పాల్గొన్నారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ (UNFCCC), మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా క్లైమేట్ వీక్ (MENACW) 2023 సెక్రటేరియట్‌తో సమన్వయం, సహకారంతో సౌదీ అరేబియా రియాద్‌లో ఆతిథ్యమిస్తుందని ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. MENACW 2023 రియాద్‌లో అక్టోబర్ 8 నుండి 12  వరకు నిర్వహించబడుతోంది. ఇందులో పెద్ద సంఖ్యలో మంత్రులు, అధికారులు, మీడియా నిపుణులు పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com