శ్రీలీల దుమ్ము దులిపేయనుందిగా.!

- July 25, 2023 , by Maagulf
శ్రీలీల దుమ్ము దులిపేయనుందిగా.!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా శ్రీలీల చెలామణీ అవుతోన్న సంగతి తెలిసిందే. శ్రీలీలకు అందంతో పాటూ, యాక్టింగ్ టాలెంట్ కూడా ఎక్కువే. ఏదో తెలియని ఎట్రాక్షన్. అదే టాలీవుడ్ మేకర్లను అయస్కాంతంలా ఆకర్షించేసింది.

ఓ మోస్తరు యంగ్ హీరోలతో పాటూ, స్టార్ హీరోలు సైతం శ్రీలీలనే తమ స్క్రీన్ పాట్నర్‌గా ఎంచుకోవడానికి ఇదే కారణం. ఇక శ్రీలీల మంచి డాన్సర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి సినిమా ‘పెళ్లి సందడి’కి ఆమె డాన్సులే స్పెషల్ అట్రాక్షన్.

ఇక, మాస్ రాజా రవితేజ పక్కన మాస్ డాన్సులిరగదీసి మాస్ రాజానే డామినేట్ చేసేసిందీ అందాల తెలుగమ్మాయ్. ఇక, శ్రీలీల చేతిలో ప్రస్తుతం వున్న ప్రాజెక్టుల్లో డాన్సింగ్ స్టార్స్ కూడా వున్నారు.

నితిన్ మంచి డాన్సర్.. నితిన్‌తో వక్కంతం వంశీ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకేముంది ఈ ఇద్దరి కాంబోలో రాబోయే సాంగ్స్ ఏ లెవల్లో వుండబోతున్నాయో ఊహించుకోవడమే కష్టం.

అంతేనా.! మరో డాన్సింగ్ స్టార్ రామ్ పోతినేని.. రామ్‌తో శ్రీలీల చేసే డాన్సింగ్ ఫెస్టివల్ మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అనే రేంజ్‌లో వుండబోతున్నాయట. ఇంకేముంది డాన్స్ లవర్స్‌కి శ్రీలీల ఫ్యూచర్ ప్రాజెక్లులు పండగే పండగ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com