శ్రీవారి భక్తులకు అలర్ట్..
- July 25, 2023
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నారు. నెల రోజుల పాటు అంటే.. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మూసివేస్తారు. ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి పుష్కరిణిలో నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఇందుకోసం ఆగస్టు 1వ తేదీ నుండి 31 వరకు పుష్కరిణిని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే, నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి మరమ్మతులను పూర్తి చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం నెల రోజుల సమయం పట్టనుంది.
పుష్కరిణి మరమ్మతుల కోసం తొలి 10 రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తర్వాత 10 రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







