మరో తెలుగు దర్శకుడితో తమిళ హీరో ధనుష్.?
- July 26, 2023
తమిళ హీరో ధనుష్ తెలుగు సినిమాపై బాగా ఫోకస్ పెట్టాడు. ఈ మధ్యనే వెంకీ అట్లూరితో ‘సార్’ సినిమా చేశాడు. ధనుష్ నటించిన తొలి తెలుగు స్ర్టెయిట్ మూవీ ఇది. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో జరిగుతున్న అరాచకాల్ని ఎండకట్టే వైనాన్ని ఈ సినిమాలో చూపించిన విధానం అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా మరోసారి ధనుష్ ఇంకో తెలుగు డైరెక్టర్‌తో పని చేయబోతున్నాడనీ తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు. కూల్ అండ్ లవ్లీ సినిమాలకు పెట్టింది పేరైన శేఖర్ కమ్ముల.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ధనుష్ నటించబోతున్నాడట. ఆల్రెడీ స్క్రిప్టు వర్క్ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదికెళ్లనుంది. రీసెంట్‌గా ‘లవ్‌స్టోరీ’ సినిమాతో శేఖర్ కమ్ముల హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
ఇక ధనుష్‌తో తెరకెక్కించబోయే సినిమాని తెలుగు, తమిళంతో పాటూ, హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. సో, ఈ సినిమాని ప్యాన్ ఇండియా యాంగిల్‌లోనే చూడొచ్చు. అన్నట్లు అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా కోసం ఓ పాట కూడా పాడేశారు హీరో ధనుష్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







