తిరుమలలో ఉగ్ర జెండాలు
- May 16, 2016
తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ భారత దేశంలో ఎంతో పుణ్యక్షేత్రంమైన తిరుపతిలో ఇప్పుడు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ జెండాలు వెలిశాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలను వణుకి పుట్టిస్తున్న ఉగ్రవాద సంస్థ కన్ను తిరుపతి పై పడిందా అని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారత దేశంలో ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థలు పుణ్యక్షేత్రాలపై కన్నేయడం ఒకింత భయాందోళన కలిగించే విషయమే. తిరుమలలోని జాపాలీ తీర్థానికి వెళ్లే రహదారిలో ఈ జెండా కనిపించడం షాక్‌కు గురి చేసింది.ఈ జెండాతో పాటు ఓ సామాజిక వర్గానికి చెందిన జెండాలు కూడా అక్కడ కనిపించాయి. ఇప్పటికే ఇంటిలీజెన్స్ వారు ఉగ్ర వాదుల నుంచి ముప్పు ఉందని ఇప్పటికే పలు మార్లు అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేశారు. ఈ సంవత్సరం మొదలు పంజాబ్ లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తిరుపతిలో ఐఎస్ఐఎస్ జెండా దర్శనమివ్వడంతో భక్తులు షాక్ తిన్నారు. దీంతో వెంటనే పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆ జెండాలను తొలగించారు. ఐతే వాటిని అక్కడ పెట్టింది ఎవరన్నది తేలాల్సి ఉంది. కాగా అసలు ఈ జెండాలను పవిత్ర తిరుమల క్షేత్రం పైకి ఎందుకు తెచ్చారన్నది ప్రశ్నగా మారింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







