'యు' సర్టిఫికేట్ తో 'బ్రహ్మోత్సవం'
- May 16, 2016
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత శ్రీకాంత్ అడ్డాల, మహేశ్ కాంబినేషన్లో రూపొందిన 'బ్రహ్మోత్సవం' ఈనెల 20న విడుదలకు సిద్ధమైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న చిత్రం సోమవారం సెన్సార్ పూర్తిచేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. సింగిల్ కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తిచేసుకుని శుక్రవారం విడుదలకు రెడీ అయింది. కుటుంబ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంపై మహేశ్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రచారాన్ని ముమ్మురం చేసింది 'బ్రహ్మోత్సవం' యూనిట్. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలతో పాటు సాంగ్ మేకింగ్ వీడియోస్‌తో అభిమానుల్లో మరింత జోష్ పెంచింది. ముగ్గురు ముద్దుగుమ్మలు సమంత, కాజల్, ప్రణీత అందచందాలు 'బ్రహ్మోత్సవం'కు అదనపు ఆకర్షణ అవుతాయంటున్నారు సినీజనం.
సూపర్‌స్టార్ మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్, డాన్స్: రాజుసుందరం, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ గుణ్ణం, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







