మష్రూమ్ కట్లెట్స్
- May 16, 2016
కావలసిన పదార్థాలు : వెన్న - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (పెద్దవి), బాదం పేస్టు - 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా - అర టీ స్పూను, టమోటో గుజ్జు - 1 టేబుల్ స్పూను, బటన్ మష్రూమ్స్ (నలుపలకలుగా తరగాలి) - 50 గ్రా., తాజా మొక్కజొన్న గింజలు - 50 గ్రా., బంగాళదుంపలు - 50 గ్రా., బ్రెడ్ పొడి - 150 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా., నీరు - 100 గ్రా., మైదా - 2 టేబుల్ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయల్ని దోరగా వేగించుకోవాలి. తర్వాత వెన్న, బాదం పేస్టు, గరంమసాలా, టమాటో గుజ్జు, మష్రూమ్స్, మొక్కజొన్న గింజలు, ఉడికించి మెదిపిన బంగాళదుంప, ఉప్పువేసి 2 నిమిషాల పాటు వేగించి దించేసి చల్లారనివ్వాలి. తర్వాత 50 గ్రా. బ్రెడ్ పొడిని కలిపి మీకు కావలసిన ఆకారంలో కట్లెట్స్లా తయారుచేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలోకి కార్న్‌ఫ్లోర్, మైదా, సరిపడా ఉప్పు వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. కట్లెట్లను ఈ జారులో ముంచి మిగిలిన బ్రెడ్ పొడిలో పొర్లించి నూనెలో వేగించుకోవాలి. వీటిని పుదీనా చట్నీతో లేక టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









