అల్లు శిరీష్, మెహరీన్ కాంబినేషన్‌లో..
- May 16, 2016
'కృష్ణగాడి వీర ప్రేమగాథ'లో నటించిన మెహరీన్ గుర్తుందా? అందం, అభినయ పరంగా ఆ చిత్రంలో మంచి మార్కులే కొట్టేసింది. అందుకే మెహరీన్ రెండో సినిమా దక్కించుకోగలిగింది. అల్లు శిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఏంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో ఆ మధ్య ఓ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. ఎస్. శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన మెహరీన్‌ని కథానాయికగా ఎంపిక చేశారు.''ఈ చిత్రంలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా తగిన ప్రాధాన్యం ఉంటుంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'లో మెహరీన్ బాగా నటించడంతో తీసుకున్నాం'' అని నిర్మాతలు పేర్కొన్నారు. ''మంచి కాన్సెప్ట్‌తో సాగే చిత్రం ఇది. లవ్ ఎంటర్‌టైనర్. అల్లు శిరీష్, మెహరీన్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి'' అని దర్శకుడు చెప్పారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ -''ఈ చిత్రదర్శకుడు ఎంవీఎన్ రెడ్డి తండ్రి మల్లిడి సత్యనారాయణగారు మా అన్నయ్య అల్లు అర్జున్‌తో 'బన్నీ' తీశారు. ఇప్పుడు ఆయన తనయుడి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది'' అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









