డెలివరీ బైక్‌కు నిప్పంటించిన 17 ఏళ్ల యువకుడు
- August 03, 2023
దుబాయ్: డెలివరీ బైక్‌ను దొంగిలించి నిప్పంటించిన 17 ఏళ్ల యువకుడిని జ్యుడీషియల్ ప్రొబేషన్ కింద ఉంచినట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ బుధవారం తెలిపింది. యువకుడు, మరొకరితో కలిసి ఎమిరేట్స్ జువైనల్ కోర్టులో దొంగతనం, దహనం చేసినట్లు అభియోగాలు మోపారు. రెస్టారెంట్లో పార్క్ చేసిన బైక్‌ను దొంగిలించి ఇద్దరూ వెళ్లిపోయారని పేర్కొన్నారు. మరొక ప్రాంతంలో మోటర్‌బైక్ నిప్పంటించారని, దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాలుడిని జ్యుడిషియల్ ప్రొబేషన్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. నేరంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తిని కోర్టుకు రిఫర్ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలని , సంఘంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా మారేలా వారికి అవగాహన కల్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







