టొరొంటోలో తెలంగాణ నైట్ నాలుగో వార్షిక సాంస్కృతిక కార్యక్రమం..
- May 16, 2016
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) కెనడా ఆధ్వర్యంలో టొరొంటో నగరంలో నిర్వహించిన తెలంగాణ నైట్ నాలుగో వార్షిక సాంస్కృతిక కార్యక్రమంలో 'తెలంగాణ పోరు ద్విశతి' పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు టీడీఎఫ్ నిర్వాహ కుడు ఎం.సృజన్ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌లోని పింగళి మహిళా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్క శంకర్ నారాయణ రచించిన ఈ పుస్తకాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.రెండు భాగాలుగా ఉన్న ఈ కవితా సంపుటిలో మొదటి భాగంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర, రెండో భాగంలో రచయిత పాటల్లో తెలంగాణ లొల్లి అంశాలున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మిమిక్రీ కళాకారుడు లోహిత్, సహ నిర్వాహకులు భూపతి కృష్ణమూర్తి, కేశవరావ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







