'గూగుల్ బ్రెయిన్' ప్రాజెక్టు..
- May 16, 2016
గూగుల్ ఓ రొమాంటిక్ రచయితను తయారు చేస్తోంది. అయితే.. అది మనిషి కాదు. కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్‌ఇంటలిజెన్స్)తో పనిచేసే ఓ మెషీన్. కానీ.. అచ్చం జనాలు మాట్లాడుకునే భాషలో కథలు రాయగలదు! రొమాంటిక్ నవలలు అంతకంటే బాగా రాయగలదట. అందుకోసం గూగుల్ ఇప్పుడు ఆ 'కృత్రిమ రచయిత'తో కొన్ని వేల కథలను.. నవలలను చదివిస్తోంది.
2011లో ప్రారంభమైన 'గూగుల్ బ్రెయిన్' ప్రాజెక్టులో భాగంగా.. ఈ కృత్రిమ మేధస్సు(ఏఐ) మెషీన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మనుషుల మెదడు ఎలా పనిచేస్తుందో.. అలాగే పనిచేసేలా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం దాదాపు పదకొండు వేల ఈ-బుక్స్‌ను దానితో చదివించారట. వాటిల్లో 2,865 రొమాంటిక్ నవలలు.. కథలు కూడా ఉన్నాయి. మరో 15 వందల ఫాంటసీ నవలలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నింటిలో కలిపి రెండు వాక్యాలను ఇచ్చి కొత్త వ్యాక్యాలను రాయమంటే.. చకచకా రాసేసిందట. ఈ కృత్రిమ రచయిత పనితీరును ఇటీవల జరిగిన 'లర్నింగ్ రిప్రజెంటేషన్స్' అనే అంతర్జాతీయ సదస్సులో గూగుల్ పరిశోధకులు ప్రదర్శించారు.
''ఈ కృత్రిమ రచయిత అందుబాటులోకి వస్తే.. ఇక భవిష్యత్తులో రొమాంటిక్ నవలా రచయితలు ఉపాధికోసం ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి రావొచ్చు'' అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







