టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
- August 07, 2023
తిరుమల: టీటీడీ (Tirumala Tirupati Devasthanams) పాలక మండలి ఇవాళ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మెట్ల మార్గం భక్తుల కోసం నరసింహస్వామి ఆలయం వద్ద నుండి రూ.4 కోట్లతో మోకాలి మిట్టవరకు షెల్టర్ నిర్మించాలని నిర్ణయించింది.
తిరుమల రింగ్ రోడ్లో ఎలక్ట్రిక్ బస్సుల కోసం రూ.2.24 కోట్లతో చార్జింగ్ స్టేషన్ నిర్మించడానికి ఆమోదం తెలిపింది. అలాగే, రూ.24 కోట్లతో మొదటి ఘాట్లో రక్షణ గొడలు నిర్మాణం, రూ.4.50 కోట్లతో అన్నప్రసాదం భవనంలో వంట సామగ్రి కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయంలో రూ.23 కోట్లతో వైకుంఠం కాంప్లెక్స్ తరహాలో క్యూలైన్ల ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.
పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి రూ.75.86 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. శ్రీనివాస సేతు వద్ద రూ.3 కోట్లతో సబ్ వే నిర్మాణం, రూ.3.10 కోట్లతో శ్రీనివాస మంగాపురం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస సేతు పనులకు రూ.118 కోట్లు పెండింగ్ ఉన్నాయి.
పనులు పూర్తి అయిన తరువాత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో నైవేద్యం ప్రసాదాల తయారీ కోసం టీటీడీ డైరీలో నెయ్యి ప్లాంట్ రూ.4.50 కోట్లు, టీటీడీ 69 ఆస్తులకు ఫెన్సింగ్ కోసం రూ.1.69 కోట్లు కేటాయింపు, రూ.11.50 కోట్లు ఆయుర్వేద ఆసుపత్రిలో అదనపు ఫ్లోర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2.20 కోట్లతో టీబీ వార్డు నిర్మించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







