దుబాయ్‌కి చేరుకున్న భారత యుద్ధనౌకలు

- August 10, 2023 , by Maagulf
దుబాయ్‌కి చేరుకున్న భారత యుద్ధనౌకలు

దుబాయ్: ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్ (FOCWF) రియర్ అడ్మిరల్ వినీత్ మెక్‌కార్టీ ఆధ్వర్యంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ త్రిఖండ్ అనే రెండు నౌకలు దుబాయ్‌లోని పోర్ట్ రషీద్‌కు చేరుకున్నాయి. ఇవి 'జాయెద్ తల్వార్' పేరుతో నిర్వహించే ద్వైపాక్షిక ఎక్సర్ సైజుల్లో పాల్గొననున్నాయి. ఈ రెండు నౌకలు ఆగస్టు 8 నుండి ఆగస్టు 11 వరకు పోర్ట్ రషీద్‌ను సందర్శిస్తాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల నౌకాదళాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి మరియు సంబంధాలను బలోపేతం చేయడానికి ఉత్తమ పద్ధతులను షేర్ చేసుకుంటాయని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ పర్యటన రెండు నౌకాదళాల మధ్య సముద్ర భాగస్వామ్యాన్ని పెంచుతుందన్నారు.

ఇదిలా ఉండగా.. 1972లో ఇండియా, యూఏఈ దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. యూఏఈ తన రాయబార కార్యాలయాన్ని 1972లో ఢిల్లీలో ప్రారంభించింది. అయితే భారతదేశం 1973లో అబుధాబిలో తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com