కువైట్ లో 'బార్బీ' సినిమాపై నిషేధం
- August 10, 2023
కువైట్: కువైట్‌లో "బార్బీ" మరియు "టాక్ టు మీ" చిత్రాల ప్రదర్శనను నిషేధిస్తూ కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ కమిటీ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎతిక్స్, సోషల్ ట్రెడిషన్స్ పరిరక్షణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రెస్ అండ్ పబ్లికేషన్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లాఫీ అల్-సుబేయి తెలిపారు. "రెండు సినిమాలు కువైట్ సమాజానికి.. ప్రజల నమ్మకాలకు విరుద్ధంగా ప్రభావితం చేస్తున్నాయని కమిటీ పేర్కొంది," అని కమిటీ అధిపతి అల్-సుబెయి వెల్లడించారు. “ఏదైనా విదేశీ సినిమాపై నిర్ణయం తీసుకునేటప్పుడు, కమిటీ సాధారణంగా పబ్లిక్ ఎతిక్స్ కు విరుద్ధంగా ఉండే సన్నివేశాలను సెన్సార్ చేయాలని ఆదేశిస్తుంది.’’ అని పేర్కొన్నారు. "కానీ ఒక సినిమా సందేశం లేదా ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను కలిగి ఉన్న సందర్భంలో మొత్తంగా సినిమాను నిషేధించాలని కమిటీ నిర్ణయిస్తుంది." అని, ఈ నియమం అన్ని విదేశీ సినిమా నిర్మాణాలకు వర్తిస్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







