నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
- August 11, 2023
డీఆర్డీవోలో 204 సైంటిస్ట్-బీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ నెల 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. http://www.drdo.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ లో స్కోరుకు 80శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 20శాతం వెయిటేజీ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మెట్రో నగరాల్లో నెలకు లక్ష రూపాయల వరకు శాలరీ ఉంటుంది.
పోస్టులు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, జీతం వివరాలు..
- పలు విభాగాల్లో సైంటిస్ట్ బి ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
- మొత్తం పోస్టులు 204.
- ఒక్కో విభాగానికి ఒక్కో విధంగా విద్యార్హతలు ఉన్నాయి.
- ఎంపికైన వారు స్థాయి-10 (7వ CPC)లో నెలవారీ పే స్కేల్ పొందుతారు. చేరిన సమయంలో మొత్తం చెల్లింపులు ప్రస్తుత మెట్రో సిటీ రేటు ప్రకారం నెలకు సుమారు లక్ష రూపాయలు అవుతుంది.
- గరిష్ట వయోపరిమితి 35 నుండి 40 సంవత్సరాలు. భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు వారి సంబంధిత రంగాలు/ విభాగాల్లో సంబంధిత సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- DRDO రిక్రూట్మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి గల అభ్యర్థులు DRDO అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ను ఫిలప్ చేసి అదే వెబ్సైట్ లో సమర్పించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- కమిటీ నిర్వహించే మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- DRDO రిక్రూట్మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీ లేదా అంతకు ముందు సమర్పించాలి.
- అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అదీ ఆన్ లైన్ లో మాత్రమే. ఈ ఫీజు నాన్ రీఫండబుల్.
- SC/ ST/ PWD, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము మినహాయించబడింది.
- కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎంపికైన అభ్యర్థులు రిమోట్/ఫీల్డ్ ఏరియా స్థానాలతో సహా భారతదేశంలో ఎక్కడైనా సేవలందించే బాధ్యతను కలిగి ఉంటారు.
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ ఇంజినీరింగ్ పాస్ అయి ఉండాలి.
DRDO రిక్రూట్మెంట్ 2023.. ఎలా దరఖాస్తు చేయాలి:
- DRDO రిక్రూట్మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు DRDO అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారమ్ నింపాలి. అదే వెబ్‌సైట్‌కు సమర్పించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆన్లైన్ లో అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 31.08.2023.
- అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ ను సమర్పించే చివరి తేదీ లేదా అంతకు ముందు సమర్పించాలి.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









