ఈనెల 22 న మొదలుకానున్న 'ధృవ'
- May 17, 2016
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'తనీ ఒరువన్' రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ ఈనెల 22నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సినిమాకి కీలకం కానున్న యాక్షన్ సీక్వెన్స్ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రంకోసం రామ్ చరణ్ తేజ్ లుక్‌ను పూర్తిగా మార్చేశాడట సురేందర్ రెడ్డి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత జూన్ 20నుంచి కశ్మీర్‌లో జరగనున్న షూటింగ్‌లో చిత్రంలోని కీలకపాత్రధారాలు నటించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోంది. కీలకపాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామి నటన ఈచిత్రానికే హైలెట్ కానుందట. తమిళంలో ఘన విజయం సాధించి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం తెలుగు రీమేక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఒరిజినల్ వెర్షన్‌కు మ్యూజిక్ అందించిన హిప్ హప్ అది ఈ సినిమాకూ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో 'ధృవ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







